తిరుమలలో పోయిన విలువైన బ్యాగు.. భక్తులకు సురక్షితంగా అప్పగింత |

0
1

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన గుంటూరుకు చెందిన ఓ కుటుంబం పోగొట్టుకున్న విలువైన బ్యాగును టీటీడీ భద్రతా సిబ్బంది సురక్షితంగా తిరిగి అప్పగించారు. రెండో ఘాట్ రోడ్డులో జారిపోయిన ఈ బ్యాగులో 61 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2,02,840 నగదు, సుమారు రూ.10 లక్షల విలువైన భూమి పత్రాలు ఉన్నాయి.

బ్యాగును గుర్తించిన ఓ బైకర్ జీఎన్సీ టోల్‌గేట్ వద్ద విధుల్లో ఉన్న హోంగార్డుకు అప్పగించారు. అనంతరం టీటీడీ సిబ్బంది భద్రపరిచి, సరైన గుర్తింపు ఆధారాలను పరిశీలించిన తర్వాత భక్తుల కుటుంబానికి అందజేశారు. ఈ ఘటనతో టీటీడీ సిబ్బంది నిజాయతీ, సేవాభావంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.