పాలకొండలోని ఋషి యోగా కేంద్రంలో యోగా మాస్టర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఆదివారం ఉదయం నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతి చెందిన వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు.
ఈ దుర్ఘటనలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురూజీ శిష్యులు సుమారు 80 మంది మృతికి సంతాప సూచికంగా మౌనదీక్ష పాటించారు. ఈ కార్యక్రమంలో సాధకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.










