అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు తొలగించకుండా, అనర్హుల పేర్లు లేకుండా పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.
శనివారం విజయనగరం కలెక్టరేట్లో ఎస్ఐఆర్పై ఈఆర్డీఓలు, ఏఈఆర్డీలు, రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సుమారు 82 వేల మంది యువ ఓటర్లను జాబితాలో చేర్చాల్సి ఉందని, వారిపై ప్రత్యేక దృష్టి సారించి అవగాహన కల్పించాలన్నారు.










