వంగరలో తాగునీటి సరఫరా ఆదివారం నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు బోరు మోటర్లు వద్ద నీటిని పట్టుకుంటున్నారు. శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో తాగునీటి ట్యాంకులో నీరు నింపేందుకు అవ్వలేదని ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది తెలిపారు.
ప్రస్తుతం నీటిని ట్యాంకులకు ఎక్కిస్తున్నామని ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు తాగునీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.










