జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలనరసమ్మ (65) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ జ్ఞానప్రసాద్ తెలిపారు. పొలంలో మేకలు మేపేందుకు వెళ్లిన అప్పలనరసమ్మను శనివారం సాయింత్రం పాము కాటు వేసింది.
పొలంలో ఉన్న వారు గమనించి హుటాహుటిన సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.










