🎤ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న 1వ వార్డు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు మరోసారి తన చొరవను చాటుకున్నారు. 1వ వార్డు పరిధిలోని డ్రైనేజీలో గత కొంతకాలంగా చెత్త, మట్టి భారీగా పేరుకుపోవడంతో మురుగునీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తి, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన ప్రజలు ఈ సమస్యను కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారి దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రజల వినతిపై తక్షణమే స్పందించిన ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగి జెసిబి (JCB) సహాయంతో డ్రైనేజీ శుభ్రపరిచే పనులను చేపట్టారు. డ్రైనేజీలో పేరుకుపోయిన మట్టిని, చెత్తను పూర్తిగా తొలగించి, మురుగునీరు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా వెళ్లేలా తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా మార్గం సుగమమైంది. ప్రజల సమస్యలను విని వెంటనే స్పందించి, త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్న కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారి చొరవపై స్థానిక వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










