🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉందని వాంకిడి మండలం బెండర ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కనకయ్య తెలిపారు.
ఇంటర్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ, టెన్ ప్లస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం 2, 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ఫీజు చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.










