మల్లంపేటలో అక్రమ నిర్మాణాల జోరు? అధికారులు మౌనం!

0
3

మల్లంపేట:

‎మల్లంపేటలోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా 150 గజాల స్థలాల్లో G+4 అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి

‎చిన్న విస్తీర్ణంలోని ప్లాట్లలో ఇంత భారీ నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఏ నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు చేశారు? అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నట్లయితే అధికారులు ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

‎150 గజాల ప్లాట్లలో G+4 నిర్మాణాలకు అనుమతి ఉందా?

‎నిర్మాణాలకు మంజూరైన బిల్డింగ్ పర్మిట్లు ఏమిటి?

‎అనుమతించిన ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయా?#GPlus4

‎ఫైర్ సేఫ్టీ, పార్కింగ్, సెట్‌బ్యాక్ నిబంధనలు పాటిస్తున్నారా?

‎నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు ఎప్పుడు?