న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శితో సింగరేణి సీఎండీ భేటీ

0
1

సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, ఐఏఎస్, బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సేవాలా నాయక్ ముడేను మర్యాదపూర్వకంగా కలిశారు,ఈ సందర్భంగా విదేశాల్లో కీలక ఖనిజాల (Critical Minerals) సముపార్జనకు సింగరేణి చేపడుతున్న కార్యక్రమాలు.

అంతర్జాతీయ స్థాయిలో సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, దేశ దీర్ఘకాలిక కీలక ఖనిజ భద్రతకు సింగరేణి అందించనున్న సహకారం తదితర అంశాలపై చర్చించారు.ఈ భేటీలో సింగరేణి డైరెక్టర్ (పర్సనల్ & ఫైనాన్స్) శ్రీ గౌతమ్ పోట్రు, ఐఏఎస్, సీఎండీ వెంట పాల్గొన్నారు.