🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై హియరింగ్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.మంగళవారం నాడు తహశీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న హియరింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు నిర్వహిస్తున్న నోటీసులు, రికార్డు రిజిస్టర్లు, అలాగే ఓటర్లు సమర్పించిన వివిధ ధ్రువపత్రాలను ఆమె నిశితంగా తనిఖీ చేశారు.అనంతరం కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ. కేంద్ర ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ మొత్తం సాగాలని స్పష్టం చేశారు. విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా హియరింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.










