మంచిర్యాల :కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల భూములను దోపిడీ చేయడానికి తీసుకువచ్చిన 22A నిషేదిత భూముల జాబితాను రద్దు చేయాలని మరియు దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల RDO కార్యాలయం ఎదుట 22A బాధిత ప్రజలతో కలిసి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రఘునాథ్ వెర్రబెల్లి పాల్గొన్నారు .
గతంలో BRS ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో పేద ప్రజల భూములు దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పేరుతో GO 22A తో పేదల నివాస మరియు వ్యవసాయ భూములు దోచుకోవడాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ GO తీసుకవచ్చింది. 22A లో ఉన్న అర్హులైన పేదల భూములను తొలగించాలి లేదా 22A GO ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు దేనికి బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు










