స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా 13 జెడ్పీలను 28కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలకు కూడా జెడ్పీలను మంజూరు చేసింది.
వీటితో పాటు అదనంగా 15 జెడ్పీ సీఈవో, 15 Dy. సీఈవో పోస్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నెల 24న ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన అనంతరం 28 జెడ్పీల వ్యవస్థ అమల్లోకి రానుంది.










