Andhra Pradesh కదిరి 17వ వార్డులో రూ.7.50 లక్షలతో రోడ్డు అభివృద్ధి| By Vinod Kumar - 11 September 2026 0 10 Share FacebookXWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL కదిరి: పట్టణంలోని 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లకు సంబంధించిన వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైన సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నారు. పాఠశాలకు వెళ్లే చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి ఫ్లైఓవర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డులో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.