పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వార్షిక సాయం రూ. 6,000 నుంచి రూ. 10,000కు పెంచినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంటులో స్పష్టతనిస్తూ, మొత్తాన్ని పెంచే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని వెల్లడించింది. అర్హులైన రైతులకు ఏడాదికి యథావిధిగా రూ. 6,000లను మూడు విడతల్లో డీబీటీ ద్వారా అందిస్తున్నారు. 23వ విడత నిధులు ఇటీవలే విడుదల కాగా, తదుపరి విడతకు సంబంధించిన తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. రైతులు వదంతులను నమ్మకుండా అధికారిక పోర్టల్ ద్వారా తమ ఈకేవైసీ, ఆధార్ అనుసంధాన వివరాలను సరిచూసుకోవాలని సూచించారు.










