*SPSR నెల్లూరు జిల్లా*
*తేదీ 10.09.2026*
నెల్లూరు జిల్లా గాంధీనగర్ రోడ్డులోని ఆర్ఎస్ఎన్ కల్యాణ మండపంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ జిల్లా స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు, జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేశారు.










