ఫార్మ్ పాండ్స్, వీడ్ మ్యాట్‌తో పంట సంరక్షణ |

0
0

భారత్ ఆవాజ్ న్యూస్:నల్లచెరువు మండలం ఉద్యాన పంటల్లో నీటి కొరతను అధిగమించి సాగు వ్యయాన్ని తగ్గించేందుకు రైతులు ఫార్మ్ పాండ్స్, డ్రిప్ ఇరిగేషన్, వీడ్ మ్యాట్‌ను సద్వినియోగం చేసుకోవాలని మండల ఉద్యానశాఖ అధికారి కుమారి లావణ్య సూచించారు.ఫార్మ్ పాండ్స్‌లో నీటిని నిల్వ చేసి డ్రిప్ ద్వారా పంటలకు అందించవచ్చని తెలిపారు.

మామిడి, చీని, దానిమ్మ వంటి పంటల్లో వీడ్ మ్యాట్‌ను వినియోగించడం ద్వారా కలుపు నియంత్రణతో పాటు నేలలో తేమను కాపాడి నీటి ఆవిరీభవనాన్ని తగ్గించవచ్చన్నారు.20×20×3 మీటర్ల ఫార్మ్ పాండ్‌కు యూనిట్ ఖర్చు ₹1.80 లక్షలు కాగా, ప్రభుత్వ రాయితీ ₹90 వేలుగా ఉందని పేర్కొన్నారు.

వీడ్ మ్యాట్‌కు చదరపు మీటరుకు ₹25 ధరలో ₹12.50 రాయితీ, గరిష్ఠంగా 4,000 చదరపు మీటర్ల వరకు అర్హత ఉందన్నారు.ఈ సాంకేతిక పద్ధతులతో నీటి పొదుపు, కూలీల వ్యయ నియంత్రణతో పాటు పంటల దిగుబడి, నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని లావణ్య తెలిపారు. నల్లచెరువు మండల రైతులు ఉద్యానశాఖ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.