ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన ఎన్‌ఎస్‌యూఐ (NSUI) అధ్యక్షుడిగా ఎండీ ఆసిఫ్ అలీ నియమితులయ్యారు. ఈ నియామకం పట్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థి విభాగం నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మొదట ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కాంబ్లే, మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపిపి బొమ్మన బాలేష్ గౌడ్ గార్లు ఎండీ ఆసిఫ్ అలీని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీకి NSUI వెన్నెముక లాంటిదని, రాహుల్ గాంధీ గారి ఆశయాలతో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్ గారితో భేటీ: నూతన NSUI జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆసిఫ్ అలీ కాగజ్‌నగర్ పట్టణానికి చేరుకుని, అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ గారు ఆసిఫ్ అలీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.










