దళితుల కు స్మశాన వాటిక స్థలం కేటాయించాలని ఐ టీ డి ఎ, పి ఓ కు వినతి :చింతూరు

0
0

చింతూరులో దళితులకు స్మశాన వాటిక కేటాయించాలని చింతూరు బి ఆర్ అంబేద్కర్ దళిత సంఘ నాయకులు ఐ టి డి ఎ పి ఓ శుభమ్ నొక్వాల్ కు వినతిపత్రం ఇచ్చారు.ఆ వినతిపత్రం లో పి ఓ కు వివరిస్తూ గతంలో తమ సభ్యులు ఎవరైనా చనిపొతే శబరి నది ఒడ్డున పూడ్చి పెట్టేవారమని ఆ స్థలంప్రవాహ వేగానికి కోతకు గురైనదని, ప్రస్తుతం స్మశాన వాటిక లేనందున తమ సంఘానికి స్థలం కేటాయించాలని పత్రం ఇవ్వగా పి ఓ స్పందించి ఒక వారం లేక పది రోజుల్లో స్థలం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మెల్లెం నాగేంద్రం, ప్రధాన కార్యదర్శి ఇంటిసుదర్శన్ కుమార్, నాయకులు నక్క రజనీ కుమార్, ప్రసంగి తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri