Annamayya: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం టి. సదుం క్రాస్ వద్ద హంద్రీనీవా జలాలు ప్రవేశించడంతో టీడీపీ ఇన్‌చార్జ్ జి. శంకర్ ఘనంగా జలహారతి ఇచ్చారు.

0
2

అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం టి సదుం క్రాస్ లో తంబల్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జి శంకర్ హంద్రీనీవా జలాలు నియోజకవర్గంలోకి ప్రవేశించిన నేపద్యంలో జలహారతి కార్యక్రమం నిర్వహించారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం నీటి ప్రాధాన్యతను చాటిచెప్పేoదుకు జలహారతి కార్యక్రమం చేపట్టడం జరిగిందని శంకర్ తెలిపారు.