వినూత్నంగా ఓ మహిళా రైతు ఫ్లెక్సీ తో సీఎంకు విన్నపం…..
భారత్ అవాజ్ న్యూస్ ; వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం లోని వెంక టాపురం గ్రామంలో ఓ మహిళా రైతు రైతులను ఆదుకోవాలని తన పొలంలో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డికి ఫ్లెక్సీ రూపంలో విన్నవిండం ఇప్పుడు అందరి ఆక ర్షిస్తోంది. వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు అలమటిస్తున్నారని,వరుణ దేవుని కరుణ కోసం ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు, వర్షాలు వస్తాయని నమ్మకంతో అప్పులు తెచ్చి విత్తనాలు జల్లి, నారు పోసిన వర్షాలు కురవకపో వడంతో మధ్యలోనే పంటను వదిలేసారు. కొందరు రైతులు బావులు, కెనాల్ కాలువలు, కుంటల్లో నీరు లేక ఎండిపోయాయి, అప్పులు తీర్చలేక ఆత్మహ త్యలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులను ఆదు కోవాలని ఈ సందర్భంగా ఆమె రేవంత్ సర్కార్ ను వేడుకుంటుంది… దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










