మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నిర్వహిస్తున్న స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని మదనపల్లె రూరల్ మండలం తట్టివారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని లింగిశెట్టి చెరువు (తట్టివారిపల్లి చెరువు) కట్టపై బుధవారం నిర్వహించారు. చెరువు కట్ట, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తాజ్ మష్రూన్, డిప్యూటీ ఎంపీడీవో భారతి, పంచాయతీ సెక్రటరీ రవి, టీడీపీ నాయకులు లక్ష్మీపతి, షామీర్, శివ, ప్రజలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
Home Andhra Pradesh Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె తట్టివారిపల్లి చెరువు కట్టపై స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు.










