ప్రధాని మోదీకి చంద్రబాబు, లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు.

0
2

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం సోషల్ మీడియా వేదికగా వారు తమ సందేశాలను పంచుకున్నారు.

 

“గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, సుదీర్ఘకాలం సేవలందిస్తున్న ప్రధానిగా మీ నాయకత్వం చరిత్రాత్మకం. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా సుమారు 25 ఏళ్ల మీ ఆదర్శప్రాయమైన ప్రజాసేవ భారత ప్రగతి ప్రస్థానానికి నూతనోత్తేజాన్ని అందించింది. ‘సేవ, సంకల్ప్, సుశాసన్’ అనే మీ దార్శనికత 140 కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తినిస్తోంది” అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశసేవలో ప్రధాని మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని, ఆయనకు శ్రీ వేంకటేశ్వరస్వామి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.