Madanapalle: విశ్వకర్మ జయంతి, మోదీ జన్మదిన వేడుకలకు బీజేపీ సన్నాహాలు! పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గురువారం ఉదయం 9:30 గంటలకు ఆలయంలో మహా మృత్యుంజయ హోమం, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. అనంతరం ప్రదర్శనగా బొంతలవారి సూత్రం వద్దకు చేరుకుని బహిరంగ సభ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో బీసీలు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి సత్య, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి ఆనంద్, జిల్లా కార్యదర్శులు బర్నేపల్లి రవికుమార్, జర్మనీ రాజు, పట్టణ అధ్యక్షులు మఠం కిరణ్, మహిళా మోర్చా నాయకురాలు బాలజ్యోతి, విద్యార్థి నాయకులు జబ్బల శ్రీనివాసులు, గోకుల్, రమేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Home Andhra Pradesh Madanapalle: మదనపల్లెలో విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల ఏర్పాట్లపై బీజేపీ సమన్వయ...










