● HMWSSB అధికారులతో కలిసి పరిశీలించిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి
● తరచూ పునరావృతమవుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి
అల్వాల్, సెప్టెంబర్ 16: రామ్‌నగర్‌లో మురుగు నీటి పొంగిపొర్లే సమస్యను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి HMWSSB అధికారులతో కలిసి పరిశీలించారు. డీజీఎం వెంకటేష్, మేనేజర్ రమేష్‌తో కలిసి సమస్య ఉన్న ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా రామ్‌నగర్‌లో మురుగు సమస్య తరచూ పునరావృతమవుతోందని శాంతి శ్రీనివాస్‌రెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యకు తాత్కాలిక పరిష్కారాలతో కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలా అవసరమైన చర్యలు చేపట్టాలని HMWSSB అధికారులను కోరారు.
స్థానికులకు ఇబ్బందులు లేకుండా సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి అధికారుల సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జార్జ్, అరుణ్, ప్రశాంత్, మహేష్, రామకృష్ణ, మనీష్ తదితరులు పాల్గొన్నారు.
#Sidhumaroju
Alwal










