Madanapalle: మదనపల్లె టమోటా మార్కెట్ యార్డును బైపాస్ రోడ్డుకు తరలించేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు AMC చైర్మన్ జంగాల శివరాం రాయల్ తెలిపారు. గురువారం మార్కెట్ యార్డులో ఆయన అధ్యక్షతన ట్రేడర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగాల శివరాం రాయల్ మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ యార్డుగా మదనపల్లె మార్కెట్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.










