ఆశీర్వాద కా దియా’ కార్యక్రమంలో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబు

0
2

సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారి కార్యాలయం వద్ద ‘ఆశీర్వాద కా దియా’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ విప్ గణబాబు గారితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రమిదలు వెలిగించి ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ప్రపంచస్థాయిలో భారత్ ఖ్యాతిని నిలబెడుతున్న మోదీ గారు నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతో కీలకమని, ఎన్డీయే కూటమి ప్రభుత్వ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం వేగంగా సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.