టీచర్లపై దాడి నిందితులను వదిలిపెట్టం.. మంత్రి లోకేశ్‌ మాస్‌ వార్నింగ్‌.

0
3

విజయవాడలో స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ-2025 టీచర్లపై దాడికి వైసీపీ ముఠాలు దాడికి దిగాయంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. క్రీడాకారులుగా దేశానికి పేరు తీసుకొచ్చిన వారికి అన్యాయం చేయడం సరికాదని అన్నారు. దైవంలా భావించే టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

స్పోర్ట్స్‌ కోటాలో అవకతవకలు జరిగాయంటూ ఫేక్‌ ఆరోపణలు చేసినప్పుడే జగన్‌ దుర్బుద్ధి బయటపడిందని లోకేశ్‌ విమర్శించారు. క్రీడల్లో ప్రతిభ చూపించి టీచర్‌ ఉద్యోగాలు సాధించిన వారిని వైసీపీ అవమానిస్తోందని ఆరోపించారు.

 

తమకు న్యాయం చేయాలంటూ స్పోర్ట్స్‌ కోటా డీఎస్సీ-2025 టీచర్లు విజయవాడ శాప్‌ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని లోకేశ్‌ తెలిపారు. ఈ సమయంలో వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు టీచర్లపై దాడికి దిగారని ఆరోపించారు.