కోసిగి నిరక్షరాస్యతలో దేశంలోనే వెనకబడిన కోసిగి మండలంలో చదువుతున్న విద్యార్థుల వలసలు నివారించేందుకు ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను మూసివేస్తూ వచ్చిన ఉత్తర్వాలను రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి యస్.ఈరేష్ బి.రంగస్వామి మాట్లాడుతూ కోసిగి మండలం ఎల్ నీ ప్రభావంతో పేద మధ్య తరగతి విద్యార్థులు వలసల కరువు కాటకాలతో అల్లాడుపోతూ విద్యార్థులు ఒక పక్క విద్యకు దూరం అవుతా ఉంటే 09/09/2026 తేదిన డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ విజయవాడ , డాక్టర్ ఏ మల్లికార్జున గారు హాస్టల్ పూర్తిస్థాయిలో ఎత్తివేస్తూ ఉత్వాలు జారి చెయ్యడం సిగ్గు చేటు అన్నారు అర్ధాంతరంగా 93 మంది విద్యార్థుల జీవితాలు నాశనానికి కారకులయ్యారని దుయ్యబట్టారు, కర్నూల్ బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ప్రసూన గారు హాస్టల్ ఎత్తివేయడం లేదు పక్కనే ఉన్నటువంటి భవనాల్లోకి విద్యార్థులను మారుస్తున్నామని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసులు ద్వారా తల్లిదండ్రుల పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయించి పేరెంట్స్ తల్లిదండ్రులకు హాస్టల్ ఎత్తివేయడం లేదని హామీ ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర సంతకాలు చేయించుకొని పూర్తిస్థాయిలో హామీ విస్మరించి శనివారం రోజున హాస్టల్లో ఉన్న విద్యార్థులకు టిసిలు ఇప్పించి మీరు ఎక్కడికైనా వెళ్లండి అని హాస్టల్ నుండి విద్యార్థులను బయటికి పంపివేశారని. ఆవేదన వ్యక్తం చేశారు.










