నందిగామ 32 వార్డులకు తుది ఓటర్ల జాబితాలు

0
2

నందిగామ 32 వార్డులకు తుది ఓటర్ల జాబితాలు

నందిగామ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నందిగామ పురపాలక సంఘంలోని 32 వార్డులకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాలను వర్గాల వారీగా సిద్ధం చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు తెలిపారు.

షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), మహిళలు, వెనుకబడిన తరగతులు (బీసీ) వర్గాల వారీగా విభజించిన తుది ఓటర్ల జాబితాలను సోమవారం (21-09-2026) నందిగామ పురపాలక సంఘం నోటీసు బోర్డుపై ప్రజల తనిఖీ నిమిత్తం అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ తెలిపారు.