అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీలో షేక్ గౌస్

0
1

నందిగామ భారత అవాజ్ : టీడీపీ నాయకుడిగా పరిచయమున్న షేక్ గౌస్ తాజాగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీలో చేరారు. పార్టీ అధిష్టానం ఆయనను నందిగామ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినట్లు గౌస్ తెలిపారు. గత కొంతకాలంగా టీడీపీలో తనకు సరైన గుర్తింపు లభించకపోవడంతో రాజకీయంగా మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు.ఇటీవల షేక్ గౌస్ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ, ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరడంతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది.ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ, టీడీపీలో చాలా కాలంగా పనిచేసినప్పటికీ తనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదని తెలిపారు. ప్రస్తుతం ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నందిగామలో రాజకీయ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.

రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నందిగామ మున్సిపాలిటీలోని 32 వార్డుల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సిద్ధంగా ఉన్నామని గౌస్ తెలిపారు. ఆయా వార్డుల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తనను సంప్రదించాలని, కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పారు.అలాగే పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని షేక్ గౌస్ వెల్లడించారు.