ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC – స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి & శిక్షణ శాఖ) ఆధ్వర్యంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించనున్న 5వ మెగా జాబ్ మేళా పోస్టర్‌ను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ఘనంగా ఆవిష్కరించారు.
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు కార్పొరేట్ రంగంలో ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. నిరుద్యోగులు, అర్హత కలిగిన యువతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
జాబ్ మేళా పూర్తి వివరాలు:
• తేదీ: 28 సెప్టెంబర్ 2026
• సమయం: ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు
• వేదిక: ఉమియా భవన్ కళ్యాణ మండపం, సుబ్రమణ్యస్వామి ఆలయం ఎదురుగా, ఎస్‌బీఐ & V2 పక్కన, ఎన్‌ఏడీ కొత్త రోడ్డు, విశాఖపట్నం
• పాల్గొనే సంస్థలు: 15కు పైగా ప్రముఖ కంపెనీలు
• మొత్తం ఖాళీలు: 1000కి పైగా ఉద్యోగావకాశాలు
రిజిస్ట్రేషన్ & సంప్రదింపుల వివరాలు:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.naipunyam.ap.gov.in ద్వారా లేదా పోస్టర్‌లో పేర్కొన్న క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
హెల్ప్‌లైన్ నంబర్లు:
9988853335,
8712655688,
8790118349,
8790117279,
8555868681,
8019589895
అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాల జిరాక్స్ ప్రతులు, రెజ్యూమ్ (బయోడేటా), ఆధార్ కార్డు కాపీలతో నిర్ణీత సమయానికి ఇంటర్వ్యూలకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలిపారు.










