గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు
రథం బజార్ ముక్కోటి మహా మండపంలో శేషశయన గణపతికి పూలంగి సేవ
నందిగామ (భారత్ అవాజ్) : మండలంలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నందిగామ పట్టణంలోని రథం బజార్ ముక్కోటి మహా మండపంలో శేషశయన మహాగణపతికి పూలంగి సేవ, విశేష అర్చనలు నిర్వహించారు. వేద పండితులు దివి ధన్వంతర ఆచార్యుల ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమాది క్రతువులు, పూర్ణాహుతి పూజలను వేదోక్తంగా నిర్వహించారు.అదేవిధంగా వాసవి మార్కెట్, మెయిన్ బజార్, రైతుపేట, నెహ్రూనగర్ తదితర ప్రాంతాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.








