కోళ్లబైలు వన్ జగన్ కాలనీలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.

0
1

కోళ్లబైలు వన్ జగన్ కాలనీలో ఎగవఇంటి లోహిత, సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో 500 మందికి అన్నదానం నిర్వహించారు. శ్రీనివాసులు నాయుడు భార్య రెడ్డమ్మను శాలువాతో సన్మానించారు. అనంతరం లడ్డూ వేలంలో విష్ణువర్ధన్ రూ. 23 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమంలో లోహిత సాయి మాట్లాడుతూ ప్రజలంతా ఐకమత్యంతో పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు