కొవ్వూరులో ఘనంగా లాల్ బహుదూర్ శాస్త్రి గాంధీ జయంతి వేడుకలు

0
3

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గాంధీ సత్యం, అహింస మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్ముడు అని, లాల్ బహదూర్ శాస్త్రి దేశం కోసమే బ్రతికిన నిస్వార్థ నాయకుడని, జై జవాన్ జై కిసాన్ నినాదంతో రైతు, సైనికులకు గుర్తింపు తెచ్చారని, ప్రధానిగా ఉండి కూడా సొంత కారు వాడని నిజాయితీపరుడని వక్తలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎర్రంశెట్టి కాంతమ్మ, తెలుగుదేశం మాజీ సర్పంచ్ కోలిపల్లి ఈశ్వరరావు, ఐటీడీపీ మండల ప్రెసిడెంట్ బంటు రాజు, వైఎస్సార్సీపీ నాయకులు వై రాజారావు, గుణశేఖర్, వీఆర్పి, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.