ఆసిఫాబాద్ జనకాపూర్ 1వ వార్డులో విద్యుత్ స్తంభాల ఏర్పాటు కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ చొరవ

0
3

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్  న్యూస్ ప్రతినిధి):

ఆసిఫాబాద్ మునిసిపల్ పరిధిలోని  జనకాపూర్ 1వ వార్డులో ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని  కొత్త విద్యుత్ స్తంభాలను  దగ్గరుండి ఏర్పాటు చేయించారు.

వార్డులో విద్యుత్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ధ్యేయంగా కౌన్సిలర్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో స్థానిక ప్రజల దీర్ఘకాలిక సమస్యలు తీరనున్నాయి. ఈ పనుల పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటున్న కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్‌పై స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

“మన 1వ వార్డు అభివృద్ధియే మన లక్ష్యం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న కౌన్సిలర్ వినోద్ కుమార్ గారికి ప్రజలు ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.