మంచిర్యాలలో అక్రమ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి నలుగురు అదుపులో.. రూ.40,300 నగదు, మూడు సెల్‌ఫోన్లు, స్కూటీ స్వాధీనం

0
3

మంచిర్యాల: పట్టణంలోని కాలేజ్ రోడ్డులో హరినిలయ విల్లాస్ వెనుక ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం నార్కోటిక్ టీమ్/టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐ లక్ష్మణ్ రావు, మంచిర్యాల టౌన్ పోలీసులతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడిలో రూ.40,300 నగదు, మూడు సెల్‌ఫోన్లు, ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అదుపులోకి తీసుకున్న వారిలో మంచిర్యాల పట్టణానికి చెందిన కత్రె గణేష్, ఆరె రాజేష్, పోలక మల్లేష్‌తో పాటు జమ్మికుంటకు చెందిన మహమ్మద్ అన్వర్ పాషా ఉన్నారు.అదుపులోకి తీసుకున్న నలుగురు వ్యక్తులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, సెల్‌ఫోన్లు, స్కూటీని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు సమాచారం.