మునిసిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు బుధవారం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్ఆర్ కాలనీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.కార్మికులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు.ఇంటింటి చెత్త సేకరణకు వాడుతున్న ఈ ఆటోల పనితీరును తనిఖీ చేశారు.అనంతరం వారు చినరావూరు పార్కును సందర్శించారు. ఇక్కడ పచ్చదనంపై సిబ్బంది,సూపర్వైజర్ తో మాట్లాడారు. పార్కును అందంగా,పరిశుభ్రంగా ఉంచాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.










