కాలనీల్లో కొనసాగుతున్న డ్రైనేజీ తాగునీటి పైప్లైన్ పనుల పరిశీలన.|

0
7

● పనుల నాణ్యతలో రాజీ వద్దు

● త్వరితగతిన పూర్తి చేయాలని కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సూచన

అల్వాల్, అక్టోబర్ 15: వెంకట్రావుపేట, ప్రశాంత్ నగర్, సంపత్ చిట్టారి కాలనీల్లో కొనసాగుతున్న మురుగునీటి పారుదల (డ్రైనేజీ), తాగునీటి పైప్‌లైన్ పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆయా ప్రాంతాల్లో పనుల పురోగతిని సమీక్షించి, నిర్మాణ పనులు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు.

పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, ఈ క్రమంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ఆమె సూచించారు.

పైప్‌లైన్ పనులను పక్కాగా నిర్వహించడం ద్వారా కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలను తగ్గించడంతో పాటు, తాగునీటి సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, పౌర సదుపాయాలు అందించడమే లక్ష్యంగా పనులను సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు.

ఈ పర్యటనలో రామానుజం, అముల్,సాగర్, వాణి, యాదగిరి, మహేందర్, సాజిద్, అరుణ్, గిరి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal