ముగ్పల్ మండలంలోని కులాస్ పూర్ గ్రామంలో భూభారతి రీ-సర్వేపై గ్రామసభ నిర్వహించి, సర్వే విధివిధానాలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఏడీ శ్రీనివాసులు, ఆర్డీఓ రాజేందర్ పాల్గొని గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, రహదారులు, చెరువులు, పట్టా భూముల సర్వే ప్రక్రియను వివరించారు. ఆధునిక రోవర్ సాంకేతికతతో సర్వే నిర్వహించి ప్రతి భూమికి భూ ఆధార్, ఎల్పీఎం నంబర్ కేటాయిస్తామని తెలిపారు. తెలంగాణలో 125 ఏళ్ల తర్వాత మళ్లీ సమగ్ర భూ సర్వే చేస్తున్నారు. 1923 నిజాం కాలం నాటి మ్యాపుల మీదే ఇప్పటివరకు నడుస్తుంది.
– 18 నెలల్లో మొత్తం సర్వే పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆదేశించారు.
*మొదటి దశ పురోగతి:*
– మొదటి దశలో 2,768 గ్రామాలను ఎంపిక చేశారు. అందులో 365 గ్రామాలకు అసలు మ్యాపే లేదు.
– నిజాం కాలం నుండి మ్యాప్ లేని 378 గ్రామాలను గుర్తించారు. అందులో 5 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూధార్ నంబర్ కూడా ఇచ్చారు.
– ఇప్పటివరకు 245 గ్రామాల్లో సర్వే పూర్తయింది.
*టెక్నాలజీ & సిబ్బంది:*
– ఇప్పుడు గొలుసు, టేపుల స్థానంలో DGPS, రోవర్, GIS, QGIS టెక్నాలజీ వాడుతున్నారు. 411 రోవర్లు కొన్నారు, మరో 400 కొనబోతున్నారు.
– 5,520 లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి ప్రతి మండలంలో 4 నుండి 6 మందిని పెట్టారు.
*రైతుకు వచ్చే లాభం:*
– ప్రతి సర్వే నంబర్‌కు ఆధార్ లాగా యూనిక్ *భూధార్* నంబర్, LPM నంబర్, జియో కోఆర్డినేట్స్‌తో మ్యాప్ ఇస్తారు. భూ ఆధార్ కార్డు కూడా ఇస్తారు.
– 1948లో 40 లక్షల సర్వే నంబర్లు ఉంటే, ఇప్పుడు 2.29 కోట్లు అయ్యాయి. అందరికీ భూధార్ ఇవ్వాలి.
– భూభారతి చట్టం కింద ఇప్పటివరకు 3.8 లక్షల పాస్ బుక్కులు జారీ చేశారు.
*కులాస్ పూర్ లాంటి గ్రామాల్లో ఇప్పుడు గ్రామసభ పెట్టి రోవర్‌తో సర్వే చేసి భూ ఆధార్, LPM నంబర్ గురించి వివరిస్తున్నారు.ఇందులో గ్రామ సర్పంచ్, గుడి జనార్దన్ రెడ్డి, ఉప సర్పంచ్, కోర్వ మహిపాల్, వీడీసీ చైర్మన్, దమ్మాయి శశిధర్ రెడ్డీ, వీడీసీ వైస్ చేర్మెన్,మరియు దిల్వార్ హుస్సేన్, చెన్నూరు గంగారెడ్డి, గ్రామ సెక్రటరీ శ్రీమతి నాగరాణి,మరియు గ్రామ రెవిన్యూ అధికారి శ్రీమతి రజిత, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










