Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలోని 48 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వార్డుల వారీగా రిజర్వేషన్లను నిర్ణయిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలతో పాటు మహిళలకు కేటాయించిన స్థానాలు, అన్రిజర్వ్డ్ వార్డుల వివరాలను పొందుపరిచారు. రిజర్వేషన్ల ప్రకటనతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు తమ రాజకీయ సమీకరణాలకు పదును పెట్టే అవకాశం ఉంది.










