NSUI మహిళా నాయకులపై పోలీసుల దాడి.. ఢిల్లీలో NSUI ఆందోళన
గాయపడిన మహిళా కార్యకర్తలకు న్యాయం చేయాలని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముట్టడి
NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్
న్యూఢిల్లీ: CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో NSUI మహిళా నాయకులపై పోలీసులు బలప్రయోగం చేయడంతో పలువురు గాయపడిన ఘటనను నిరసిస్తూ న్యూఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహిళా నాయకులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న మహిళా కార్యకర్తలపై పోలీసుల బలప్రయోగం చేయడం ఆందోళనకరమని అన్నారు. గాయపడిన మహిళా నాయకులకు న్యాయం చేయడంతో పాటు, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, మహిళా కార్యకర్తల పట్ల పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
విద్యార్థుల హక్కులు, మహిళల భద్రత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం NSUI నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని అజ్మీర సురేష్ నాయక్ స్పష్టం చేశారు. మహిళా నాయకులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.










