Unknown నంబర్ల నుంచి వచ్చే కాల్స్కు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి ఫోన్ నంబరుతో పాటు కాలర్ నేమ్ కూడా డిస్ప్లే చేయాలని టెలికం సర్వీస్ ప్రొవైడర్ల (TSP)ను టెలికమ్యూనికేషన్స్ విభాగం(DoT) ఆదేశించింది. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP)ను ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. DoT ఉత్తర్వు ప్రకారం 4G, 5G నెట్వర్క్లోని వినియోగదారునికి CNAP డిఫాల్ట్ ఎనేబుల్ అవుతుంది.










