కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్

0
7

🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్ నగర్‌లో ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ పంపిణీ కార్యక్రమం జరిగింది. వార్డుకు చెందిన లబ్ధిదారురాలు కిరాముల మమతకు 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ కాపిని అందజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ గారు, మాట్లాడుతూ. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. వార్డులోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

లబ్ధిదారురాలి ఆనందం: ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ అందుకోవడం పట్ల లబ్ధిదారురాలు కిరాముల మమత ఎనలేని సంతోషం వ్యక్తం చేశారు. తమ సొంతింటి కల నిజం కాబోతుండటంపై హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌ కార్తీక్ గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్పే రమ, రాధా, దీపికా తో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.