🎤 ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో HIV, ఎయిడ్స్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ‘ఇంటెన్సిఫైడ్ IEC’ ప్రచారంలో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ కె. హరిత జెండా ఊపి ప్రారంభించారు.
కలెక్టరేట్ నుండి జిల్లా ప్రధాన ఆసుపత్రి వరకు సాగిన ఈ ర్యాలీలో. వ్యాధిపై ఉన్న అపోహలను వీడి, నివారణ చర్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










