🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శాఖా కార్యాలయంలో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేశారు.
ఈ సంబరాలలో పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అమర్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని, ప్రకృతిని పూజించే ఇలాంటి పండుగలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. బతుకమ్మల పండుగ వైభవంగా సాగింది.










