చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ నినోపై సమీక్ష

0
3

ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది,రేవంత్ రెడ్డి సమావేశం సారాంశం ఇదే

పక్క రాష్ట్రం నుంచి రూ.15కు విద్యుత్ కొనుగోలు చేసి ఇస్తామని చెబుతూనే, మనకు విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పడంపై సర్వత్రా విమర్శలు

అన్ని రాష్ట్రాలు 9 నుంచి 10 నెలల ముందే నీరు, విద్యుత్ లాంటి సాధారణ అవసరాలను సమకూర్చుకుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం

కేటీఆర్, హరీష్ రావు, ఇతర ప్రతిపక్ష నాయకులతో పాటు కొందరు అధికార పార్టీ నాయకులు చెప్పినా, కేసీఆర్‌పై కోపంతో కాళేశ్వరం, కల్వకుర్తి, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులను వినియోగించకుండా, నీటిని ఒడిసిపట్టకుండా కిందకు వదిలేసిన రేవంత్ రెడ్డి ,చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, తీరిగ్గా గోవా, ఢిల్లీ పర్యటనలు ముగిశాక ఎల్ నినోపై సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశం

పైగా, మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. అంతా అయిపోయింది, పరిస్థితి చేయి దాటిపోయింది.. నేనేం చేయలేను అని ముఖ్యమంత్రి హోదాలో ప్రజలను భయపెట్టే మాటలు మాట్లాడటం బుద్ధిహీన శైలికి నిదర్శనమని అంటున్న రాజకీయ విశ్లేషకులు

కరోనా లాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్న సమయంలో కూడా కేసీఆర్ వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి, ఏం భయపడకండి.. నేనున్నాను, భయపడకుండా ఉంటేనే క్షేమంగా ఉంటారు, పారాసెటమాల్ వేసుకుంటే చాలు అని ధైర్యం చెప్పడం విశేషం

కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి అంతా అయిపోయింది, పంటలు వేయకండి, తాగునీటికి కష్టమే, కొందామన్నా విద్యుత్ దొరకడం లేదు అని ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని వెల్లువెత్తుతున్న విమర్శలు