తెనాలి.దేవి చౌక్ లో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి గుడిలో 95వ శరన్న వతార ఉత్సవములు సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి అలంకారం చేయుచున్నారు. అమ్మవారి అలంకారముల ఉభయ దాతలకు వారి గోత్రనామాలతో సాయంకాలం సమయమున అష్టోత్తర పూజలు జరిపి శ్రీ చక్ర అర్చన ప్రసాదములతో కలిపి ప్రసాదాలు భక్తులకు ఇస్తున్నారు.. ఉభయ దాతలు స్వయంగా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు మూలా నక్షత్రం కావటం వలన శ్రీ మహా సరస్వతి దేవి అలంకారము చేసినారు. భక్తులు తండోపతండాలుగా గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులకు చున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి సేవా సంఘం మరియు శ్రీ రాజరాజేశ్వరి అన్నదాన సేవా సంఘం వారు నిర్వహిస్తున్నారు. ప్రధాన అర్చకులు శ్రీ యనమండ్ర లక్ష్మీనరసింహమూర్తి దర్శనమునకు వచ్చిన భక్తులకు గోత్రనామాలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేయుచున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సేవా సంఘము, దేవి చౌక్. అద్యక్షలు శ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి మరియు కమిటీ సభ్యులు అన్నదాన సేవా సమితి అధ్యక్షులు చివుకుల శివరామ ప్రసాద్ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమలన్నీ దిగ్విజయంగా జరుగుటకు పెద్దగా కృషి చేయుచున్నారు.










