కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత గారి ఆధ్వర్యంలో ఘనంగా రైతు మేళా. ఆకట్టుకున్న డ్రోన్ పిచికారీ ప్రదర్శన

0
60

🎤ఆసిఫాబాద్, (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మేళా కార్యక్రమం గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హరిత ఐ.ఏ.ఎస్ గారి ముఖ్య అతిథ్యత్వంలో అత్యంత వైభవంగా జరిగింది. కలెక్టర్ గారి సమక్షంలో రైతుల్లో నూతన వ్యవసాయ సాంకేతికతపై చైతన్యం నింపేందుకు ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ మేళాలో భాగంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న ఆధునిక డ్రోన్ టెక్నాలజీని జిల్లా కలెక్టర్ కె. హరిత గారు మరియు అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. ఆకాశంలో డ్రోన్‌ను ఎగురవేస్తూ పొలాల్లో పురుగుమందులు, ద్రవ ఎరువులను ఏ విధంగా తక్కువ సమయంలో సులువుగా పిచికారీ చేయవచ్చో రైతులకు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూపిస్తూ అవగాహన కల్పించారు. డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం వల్ల సమయం, పెట్టుబడి కలిసిరావడంతో పాటు రైతుల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని అధికారులు వివరించారు.

కలెక్టర్ గారికి ప్రయోజనాలను వివరించిన డిసిసిబి కరుణాకర్ గారు:

ఈ కార్యక్రమంలో డీసీసీబీ ప్రతినిధి కరుణాకర్ గారు పాల్గొని. సహకార సంఘాల ద్వారా రైతులకు కలిగే విభిన్న రకాల ప్రయోజనాలు, సేవలు మరియు సబ్సిడీల గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు రైతులకు క్షుణ్ణంగా వివరించారు.

ఈ నూతన సాంకేతిక ప్రదర్శనను కలెక్టర్ కె. హరిత గారితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సహకార సంఘాల ప్రతినిధులు మరియు ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన పెద్ద సంఖ్యలో రైతులు ఆసక్తిగా తిలకించారు.