రోలుగుంట జడ్పిటిసి టికెట్ బంటు చిరంజీవికి కేటాయించాలి. ఐ టి డి పి ప్రెసిడెంట్ బంటు రాజు.

0
2

 

రోలుగుంట మండలం చోడవరం నియోజకవర్గం పరిధిలోని రోలుగుంట మండల జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా బంటు చిరంజీవికి టికెట్ కేటాయించాలని ఐటీడీపీ మండల అధ్యక్షులు బంటు రాజు పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. కాపు సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి తరపున కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బంటు చిరంజీవి గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని పార్టీ బలోపేతానికి ప్రజల సంక్షేమానికి కృషి చేసే నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ మేరకు రోలుగుంట మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా బంటు చిరంజీవికి అవకాశం కల్పిస్తే కూటమి విజయానికి కృషి చేస్తామని తెలిపారు.