పలాస:రాబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి మొత్తం 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అధికారికంగా ప్రకటించారు . మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీపద్మను ఖరారు చేశారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, మహిళలతో పాటు జర్నలిస్టులకు కూడా ఈ జాబితాలో ప్రాధాన్యత కల్పించినట్లు తెలిపారు. 36 వార్డులకు సంబంధించిన అధికారిక జాబితాను ప్రెస్ నోట్ రూపంలో కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
వార్డుల వారీగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా:
* 1వ వార్డు: దున్నా సత్యారావు (సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్)
* 2వ వార్డు: శ్రీమతి వల్లభ వైకుంఠరావు
* 3వ వార్డు: సవర సోమేశ్వరరావు (మాజీ కౌన్సిలర్)
* 4వ వార్డు: తెప్ప దమయంతి (భర్త: తెప్ప పాపారావు)
* 5వ వార్డు: దట్టి సౌజన్య (భర్త: దట్టి సురేష్)
* 6వ వార్డు: పిచ్చుక అజయ్ (మాజీ కౌన్సిలర్)
* 7వ వార్డు: సంపతిరావు జయరాం
* 8వ వార్డు: దువ్వాడ సత్యవతి (మాజీ కౌన్సిలర్)
* 9వ వార్డు: పెంట దివ్య (భర్త: పెంట రత్నాకర్)
* 10వ వార్డు: గుజ్జు శైలజ (సోదరుడు: గుజ్జు జోగారావు)
* 11వ వార్డు: మీసాల సురేష్ సతీమణి (మాజీ వైస్ చైర్మన్ మీసాల సురేష్)
* 12వ వార్డు: మార్పు యుగంధర్
* 13వ వార్డు: తాలాసు సుశీలారాణి (భర్త: తాలాసు రాజు)
* 14వ వార్డు: బెల్లాన శ్రీనివాసరావు (మాజీ కౌన్సిలర్)
* 15వ వార్డు: బోర కృష్ణారెడ్డి (మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్)
* 16వ వార్డు: పోతనపల్లి హరి (మాజీ కౌన్సిలర్)
* 17వ వార్డు: అందలూరి కోటి
* 18వ వార్డు: చెరుకుపల్లి నాగార్జున (జర్నలిస్ట్)
* 19వ వార్డు: రోణంకి శాంతకుమారి (మాజీ కౌన్సిలర్)
* 20వ వార్డు: శ్రీమతి జయమ్మ
* 21వ వార్డు: శానాపాల సింహాచలం (మాజీ కౌన్సిలర్, మాజీ టౌన్ పార్టీ అధ్యక్షుడు)
* 22వ వార్డు: వజ్జల సౌజన్య (భర్త: కృష్ణ)
* 23వ వార్డు: బమ్మిడి సంతోష్ (మాజీ కో-ఆప్షన్ సభ్యులు)
* 24వ వార్డు: పైడి గుణలత (భర్త: పైడి శేఖర్)
* 25వ వార్డు: నత్తు జీవరత్నం (భర్త: నత్తు వెంకటరమణ)
* 26వ వార్డు: గోండ్ర శ్రీనివాసరావు (సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్)
* 27వ వార్డు: హేమారావు బేరా
* 28వ వార్డు: బోర చంద్రకళ (సీనియర్ కౌన్సిలర్, టౌన్ మహిళా విభాగం అధ్యక్షురాలు)
* 29వ వార్డు: బోర భగవతి (సీనియర్ నాయకుడు)
* 30వ వార్డు: తూముల సుజాత (భర్త: తూముల శ్రీనివాసరావు)
* 31వ వార్డు: బోనెల గణపతి
* 32వ వార్డు: కొవ్వూరు తాతారావు
* 33వ వార్డు: డొక్కరి అరుణ (భర్త: డొక్కరి దానయ్య)
* 34వ వార్డు: కొవ్వూరు హరి సతీమణి
* 35వ వార్డు: మార్పు అరుణ (భర్త: మార్పు రాము)
* 36వ వార్డు: బెవర లక్ష్మి (భర్త: బెవర కృష్ణ)
ఈ ప్రకటన అనంతరం చైర్మన్ అభ్యర్థి శ్రీపద్మ మీడియా ప్రతినిధులు మరియు సహచర అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీ విజయానికి అభ్యర్థులంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.










